ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవితగాథ ఆధారంగా తెరకెక్కించిన ఈ సినిమాకి బాలీవుడ్ ఆడియన్స్ ఫిదా అయ్యారు. హిస్టారికల్ బ్యాక్ డ్రాప్‌లో వచ్చిన ఈ సినిమాకి బాలీవుడ్ డైరెక్టర్ లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించగా స్టార్ ఫిల్మ్ ప్రొడ్యూసర్ దినేష్ విజన్ నిర్మించారు.
అయితే ప్రస్తుతం ఛావా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకెళ్తున్న ఈ సినిమాను నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ తెలుగులో విడుదల చేసేందుకు సిద్ధమయింది. ఈ నెల 7న తెలుగు ప్రేక్షకుల ముందుకు ఈ చిత్రాన్ని తీసుకురానున్నారు. ఇందులో భాగంగా తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేసింది. తెలుగులో విడుదలైన ట్రైలర్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది. ముఖ్యంగా విక్కీ కౌశల్ చెప్పిన పవర్ ఫుల్ డైలాగ్స్ అదిరిపోయాయి. మరాఠాల సింహం లేనప్పుటికీ తన వేటను ఈ ఛావా కొనసాగిస్తాడు, గర్జనకు లొంగకపోతే పంజా వేటు తప్పదు అంటూ చెప్పే డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి.
మొత్తం 3 నిమిషాలు ఉన్న ట్రైలర్ వీడియోకు నెట్టింట మంచి రెస్పాన్స్ వస్తుంది. దీంతో ఇప్పుడు ఈ సినిమా విడుదల కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఫిబ్రవరి 14న హిందీలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా రికార్డులు కొల్లగొట్టింది. శంభాజీ మహారాజ్‌గా విక్కీ కౌశల్, యేసుబాయి పాత్రలో రష్మిక నటనకు ఆడియన్స్ ఫిదా అయ్యారు. థియేటర్లలో క్లైమాక్స్ సన్నివేశాల్లో ప్రేక్షకులు కన్నీళ్లు పెట్టుకుని నినాదాలు చేసిన వీడియోలు వైరల్‌గా మారాయి.
దీంతో ఈ మూవీని తెలుగులోనూ రిలీజ్ చేయాలనే డిమాండ్లు పెరిగాయి. దీంతో మేకర్స్ తెలుగు వెర్షన్‌ను విడుదల చేసేందుకు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌కు చెందిన గీతా ఆర్ట్స్ సంస్థ ముందుకొచ్చింది. డబ్బింగ్ కార్యక్రమాలన్నీ పూరి చేసుకుని ఈనెల 7న థియేటర్లలోకి ఈ మూవీ తెలుగు వెర్షన్ రానుంది. అయితే ఈ సినిమా తెలుగు వెర్షన్ సైతం అంతే హిట్ అవుతుందని భావిస్తున్నారు.